అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన కార్యక్రమం

MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డులో బుధవారం అగ్నిమాపక సిబ్బంది అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్నిమాపక వారోత్సవాలు పురస్కరించుకొని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వివరించారు. సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అయిన సమయంలో మంటలను ఎలా అదుపు చేయాలో క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించారు.