నగరంలో యుద్ధప్రాతిపదికగా పూడికతీత పనులు

KRNL: కర్నూలు నగరంలో వాగులు, మురుగు కాలువల్లో పూడికతీత పనులు యుద్ధప్రాతిపదికగా ప్రారంభమయ్యాయి. మంగళవారం మున్సిపల్ కమిషనర్ రవీంద్ర బాబు ఆదేశాల మేరకు నగరంలోని కాలువలలో పూడికతీత పనులను వేగవంతంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. వీటి ద్వారా నీటి ప్రవాహం సజావుగా కొనసాగించడంతో పాటు, కాలుష్య నియంత్రణ తగ్గించే ప్రయత్నం జరుగుతోందన్నారు.