భూ సమస్యల పరిష్కారానికి శాశ్వత కార్యాచరణ
VSP: పదేపదే తలెత్తుతున్న భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా సమగ్ర ప్రణాళికతో కూడిన కార్యాచరణ రూపొందించి, క్షేత్రస్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కే. రఘురామ కృష్ణరాజు రెవెన్యూ, సర్వే అధికారులను ఆదేశించారు. విశాఖ కలెక్టరేట్‌లో అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు.