VIDEO: తీరని యూరియా కష్టాలు .. క్యూలైన్‌లో రైతులు

WGL: వర్ధన్నపేట పట్టణంలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. మంగళవారం తెల్లవారు జామునుంచే రైతు వేదిక వద్దకు పెద్ద ఎత్తున చేరుకొని రైతులు బారులు తీరి నిలబడ్డారు. సరిపడ యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేశారు. రైతుల బాధలను అర్థం చేసుకుని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నారు.