లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం
AP: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డిని సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ సిట్ కార్యాలయంలో ఆయనను ప్రశ్నిస్తున్నారు. గతంలో సునీల్ రెడ్డి ఇంట్లో సోదాలు చేసిన సిట్‌కు కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులు లభ్యమయ్యాయి. దీంతో నర్రెడ్డి సునీల్ రెడ్డిని తాజాగా విచారిస్తున్నారు.