VIDEO: నాగుపాముకు చికిత్స
విశాఖ: జిల్లా కేంద్రంలోని నేవల్ క్యాంటీన్ స్టోర్‌రూమ్‌లో ఉన్న అట్టపెట్టెలో శనివారం అరుదైన శ్వేత నాగు కలకలం సృష్టించింది. మల్కాపురం ప్రాంతానికి చెందిన స్నేక్ క్యాచర్ నాగరాజు, పామును చాకచక్యంగా పట్టుకున్నారు. అయితే, ఆ పాముకు గాయం తగిలినట్లు గుర్తించిన నాగరాజు, చికిత్స నిమిత్తం వెటర్నరీ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ వెటర్నరీ డాక్టర్ సునీల్ .. పాముకు చికిత్స చేశారు.