ఈనెల 15 నుండి ఉచిత శిక్షణ తరగతులు

ATP: ఈ నెల 15వ తేదీన గుంతకల్‌లో ఉన్న పీడబ్ల్యూడీ కార్యాలయంలో ల్యాండ్ సర్వేయర్ ఎలక్ట్రిషన్ కోర్సులను మూడు నెలలపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ గోవిందరాజులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణానంతరం ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. స్కిల్ డెవలప్మెంట్, న్యాక్ సంస్థ ఆధ్వర్యంలో ఈ శిక్షణ ఉంటుందన్నారు.