నియోజకవర్గంలో పర్యటన చేసిన పెద్దిరెడ్డి

CTR: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గంలో బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. ఆయా మండలాల్లో వైసీపీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలికారు. అన్ని మండలాల్లో తాజా రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి చేపట్టే కార్యక్రమాలపై చర్చించి దిశానిర్దేశం చేశారు. తర్వాత పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.