జిల్లాలో పోలీసుల స్పెషల్ డ్రైవ్

జిల్లాలో పోలీసుల స్పెషల్ డ్రైవ్

తిరుపతి జిల్లా SP సుబ్బరాయుడు ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ అనుమానాస్పద వాహనాలను సీజ్ చేశారు. చైన్ స్నాచింగ్, దొంగతనాలు, అక్రమ రవాణాను అరికట్టడమే ధ్యేయంగా పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అత్యవసర సమయాల్లో 112 నంబర్‌ను సంప్రదించాలని పోలీసులు సూచించారు.