గర్భం దాల్చిన బాలిక

KRNL: వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 15ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిపై ఆదివారం పోక్సో కేసు నమోదైంది. పాతబస్తీకి చెందిన బాలికను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా, 3 నెలల గర్భవతి అని తెలిసింది. దీంతో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు CI రామయ్య తెలిపారు. బాలికపై దాడి జరిగిన వెంటనే కుటుంబసభ్యులకు చెప్పలేకపోయిందని వివరించారు.