నీటి తొట్టెలో పడి వృద్ధుడి మృతి
CTR: పూతలపట్టు మండలం వడ్డెర్లపల్లిలో విషాదం నెలకొంది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన మునిరత్నం(65) తరచూ మద్యం తాగుతూ బానిసయ్యాడు. ఈ క్రమంలో ఇంటి సమీపంలోని నీటి తొట్టెపై కూర్చుని మద్యం తాగాడు. మత్తు ఎక్కువ కావడంతో అదుపుతప్పి అందులో పడిపోయాడు. పైకి రాలేకపోవడంతో మృతి చెందాడు.