'సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోండి'
KMM: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ చింతకాని మండలం నాగిలికొండ గ్రామంలో గ్రామ శాఖ పార్టీ అధ్యక్షుడు పగడాల రాజు ఇంటిలో కార్యకర్తలతో కలిసి కాసేపు సరదాగా మాట్లాడారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు.