పెద్దకడబూరులో 85.59 శాతం ఓటింగ్ నమోదు

కర్నూలు: పెద్దకడబూరు మండలంలోని ఎన్నికల పోలింగ్ 85.59 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు తహసీల్దార్ సురేష్ బాబు తెలిపారు. మండలంలో మొత్తం 45,820 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 22,635 మంది, స్త్రీలు 23,183 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారన్నారు. ఇందులో మొత్తం 39,216 ఓట్లు పోలయ్యాయని, పురుషులు19,654 మంది, స్త్రీలు 19,560 మంది, ఇతరులు ఇద్దరు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.