VIDEO: శ్రమదానం చేసిన శాసనసభ డిప్యూటీ స్పీకర్

MHBD: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు తమ వంతు సహకారం అందించాలని శాసనసభ డిప్యూటీ స్పీకర్, డోర్నకల్ MLA డా. జాటోతు రామచంద్రనాయక్ అన్నారు. మరిపెడ మున్సిపాలిటీలో గురువారం ఉదయం ఆయన పర్యటించి, శ్రమదానం చేశారు. ఆర్&బి గెస్ట్ హౌజ్, బస్టాండ్ ఆవరణాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించారు. అనంతరం బస్టాండ్ ఆవరణంలో స్వయంగా గుంటలు తీసి మొక్కలు నాటారు.