తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు మృతి
తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో శిశువు మృతి కలకలం రేపింది. నగరంలోని చెన్నారెడ్డి కాలనీ చెందిన జానకి 3 రోజుల క్రితం పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో బుధవారం మగ బిడ్డకు జన్మనిచ్చారు. గురువారం టీకా వేసిన తర్వాత శిశువు మృతి చెందిందని తల్లి, కుటుంబసభ్యులు ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.