విద్యుత్ షాక్‌తో ఆవులు, పొట్టేలు మృతి

KRNL: ఆదోని మండలంలోని పెద్దతుంబలం వద్ద గాలివాన బీభత్సంతో విద్యుత్ స్తంభం నేలకొరిగింది. విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో కరెంట్ షాక్కు గురై రెండు ఆవులు, ఒక పొట్టేలు మృతి చెందాయని శనివారం బాధితుడు దయ్యాల ప్రహల్లాద ఆవేదన వ్యక్తం చేశారు. మేత కోసం తీసుకెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని బాధితుడు ప్రహల్లాద వాపోయారు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.