ఎమ్మెల్యే ఇంట్లో మహిళా నేతల సందడి

అనంతపురంలోని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి నివాసంలో మహిళా నేతలు సందడి చేశారు. 'సూపర్ హిట్' సభ ముగిశాక మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు బండారు శ్రావణి, భూమా అఖిల ప్రియ తదితరులు ఆమె ఇంటికి వచ్చారు. కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకించారు. ఈ క్రమంలో తేనేటి విందు స్వీకరించారు. సభ విజయవంతం కావడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు.