పాఠశాల ముందర అడ్డగోలుగా వ్యర్థాలు

పాఠశాల ముందర అడ్డగోలుగా వ్యర్థాలు

SRPT: హుజూర్ నగర్ పట్టణంలోని ఏరియా హాస్పిటల్ వెనుక గల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ముందర కొందరు వ్యాపారులు కుళ్లిపోయిన ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డలు, పండ్లు, కూరగాయలు మురిగిపోయిన కోడిగుడ్లు వేస్తున్నారు. దీంతో ప్రాంతం అంతా దుర్గందంగా మారి ఆ మార్గంలో పాఠశాలకు వెళ్తున్న విద్యార్థినిలు ముక్కు మూసుకుని పోవాల్సిన పరిస్థితి దాపురించింది.