న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి

SDPT: న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ను సిద్దిపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సీహెచ్ జనార్ధన్ రెడ్డి కోరారు. జిల్లా న్యాయస్థానంలో మరిన్ని మౌళిక వసతులను సమకూర్చాలని అన్నారు. మంగళవారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో బార్ అసోసియేషన్ నూతన పాలక వర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా ఆయనను కలిశారు.