"అనుమతి లేకుండా ఫంక్షన్‌కు వస్తే..జైలుకే"

"అనుమతి లేకుండా ఫంక్షన్‌కు వస్తే..జైలుకే"

BHPL: భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలు వద్ద ఏర్పాటుచేసిన ఓ ఫ్లెక్సీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఫంక్షన్ హాల్ ముందు 'పిలవని పేరంటానికి రాకండి' అనుమతి లేకుండా వస్తే సెక్షన్ 441 ప్రకారం మూడు నెలల జైలు శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధిస్తామని ఫ్లెక్సీ బోర్డు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ బోర్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.