నేడు రుణ యూనిట్ల ఎంపికకు ఇంటర్వ్యూలు

నేడు రుణ యూనిట్ల ఎంపికకు ఇంటర్వ్యూలు

KNR: ఇల్లందకుంట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇవాళ ఉదయం 11 గంటలకు వివిధ రుణ యూనిట్ల ఎంపికకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో రాజేశ్వర్ రావు తెలిపారు. షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో 2025-26 రుణాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు చేపడుతున్నారు. అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు జిరాక్స్ కాపీలు తీసుకురావాలని ఆయన సూచించారు.