పర్యావరణ పరిరక్షణతో పాటు పట్టణ అభివృద్ధే లక్ష్యం

పర్యావరణ పరిరక్షణతో పాటు పట్టణ అభివృద్ధే లక్ష్యం

KKD: గొల్లప్రోలులోని స్వామి వివేకానంద జ్ఞాన మందిరం, స్వచ్ఛ గొల్లప్రోలు ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకులు పడాల కన్నారావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు పట్టణ అభివృద్ధి అడుగులు వేయడమే తమ సంస్థ సభ్యుల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఇటీవల యోగాలో డాక్టరేట్ పొందిన యోగా గురువు జ్యోతుల నాగేశ్వరరావును ఘనంగా సత్కరించారు.