అనంతపురం చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ATP: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ జిల్లా పర్యటనకు వచ్చారు. బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్‌తో పాటు పలువురు సీనియర్ నాయకులు ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరగనున్న పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాధవ్ పాల్గొననున్నారు.