VIDEO: భోగ నంజుండేశ్వర స్వామికి మాఘమాస పూజలు

CTR: పుంగనూరు పట్టణంలోని శ్రీ భోగ నంజుండేశ్వర స్వామి ఆలయంలో సోమవారం మాఘమాస పూజలు వైభవంగా జరిగాయి. ఉదయాన్నే అర్చకులు లింగానికి రుద్రాభిషేకాలు, ఫల పంచామృతాభిషేకాలు నిర్వహించారు. తర్వాత వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు చేశారు. మాఘ స్నానాలు ఆచరించిన భక్తులు భక్తిశ్రద్ధలతో పరమేశ్వరుని దర్శించుకున్నారు.