లాజిస్టిక్ హబ్‌గా శ్రీకాకుళం: కేంద్ర మంత్రి
SKLM: కనెక్టివిటిని పెంచడం ద్వారా లాజిస్టిక్ హబ్‌గా శ్రీకాకుళంను మార్చుతున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ అన్నారు. సోమవారం శ్రీకాకుళం పరిధిలోని పెద్దపాడు దగ్గర చెన్నై - కలకత్తా నగరాలను కలిపే కీలకమైన జాతీయ రహదారిలో కల్వర్ట్ నిర్మాణానికి ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రూ. 4 కోట్ల 64 లక్షల నిధులతో ఈ కల్వర్టు నిర్మిస్తున్నామన్నారు.