ఎంపీ మల్లురవిని కలిసిన తెలంగాణ ఉద్యమకారులు

మహబూబ్ నగర్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఛైర్మన్ పసుల రాజు ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమకారులు ఆదివారం హైదరాబాదులో ఎంపీ మల్లు రవిని కలిశారు. ఈ సందర్భంగా పసుల రాజు మాట్లాడుతూ.. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. అలాగే ఉద్యమకారులకు ప్రత్యేకమైన ఐడెంటి కార్డులను ఇవ్వాలని కోరారు. దానికి ఎంపీ సానుకూలంగా స్పందించారని అన్నారు.