VIDEO: 'అధికారుల హాజరు తప్పనిసరి'
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ప్రతి శాఖ అధికారులు తప్పకుండా పాల్గొనాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశించారు. శుక్రవారం కస్తూరిబాగాంధీ పాఠశాలలో వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమాలకు గైర్హాజరు అయిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.