పంచాయతీ ఎన్నికలు.. జోరుగా బుజ్జగింపులు
భద్రాద్రి: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పలు చోట్ల ఏకగ్రీవం చేసేందుకు ప్రధాన పార్టీల నాయకులు చూస్తున్నారు. ఇందుకు బుజ్జగింపులు, నగదు, పదవీ ఆశలు చూపుతూ పోటీ చేద్దామనుకునే వారిని తమ నిర్ణయం వెనక్కి తీసుకునేలా చేస్తున్నారు. ఇక పలు చోట్ల సర్పంచ్ పదవి కోసం వేలం పాటలు నిర్వహిస్తున్నారు. ఎవరు ఎక్కువ పాడితే వారినే ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు.