రోడ్డు ఆక్రమణలకు కూల్చివేత..!
MDCL: సైబరాబాద్ పోలీసులు ఇవాళ గోకుల్ ఫ్లాట్స్ నుంచి HT లైన్ వైపు వెళ్లే రహదారిపై రోడ్డు ఆక్రమణలను ఎక్కడికక్కడికి కూల్చివేసినట్లుగా తెలిపారు. రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు చేయడం, బోర్డులు ఏర్పాటు చేయడం కారణంగా ట్రాఫిక్ జాం పెరుగుతుందని గుర్తించి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. పోలీసు అధికారుల ఆధ్వర్యంలో స్మూత్ డ్రైవ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు.