అక్రమ గంజాయి సాగుపై పోలీసుల దాడి

అక్రమ గంజాయి సాగుపై పోలీసుల దాడి

ADB: జిల్లాలో అక్రమ గంజాయి సాగుపై పోలీసులు విస్తృత దాడులు నిర్వహిస్తున్నారు. వాంకిడి మండలం జైత్పూర్ గ్రామానికి చెందిన బోర్కుటే సుభాష్, గుర్నులే సురేష్, ఆత్రం భీములు గంజాయి సాగు చేసి విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 16 గంజాయి మొక్క‌లతో పాటు 2.6 కేజీల ఎండు గంజాయి ల‌భ్యం అయింది. ముగ్గురిపై కేసు న‌మోదు చేశారు.