భక్తిశ్రద్ధలతో రంజాన్ ఉపవాసాలు ప్రారంభం
TPT: పాకాల(M )గురువారం ఉదయం నుంచి భక్తి శ్రద్ధలతో రంజాన్ ఉపవాసాలు ప్రారంభమయ్యాయి. నిన్న సాయంత్రం నెలవంక కనిపించడంతో ముస్లిం సోదరుల్లో ఆనందం వెల్లివిరిసింది. రాత్రి రంజాన్ మాసంలో ఆచరించే ప్రత్యేక తరాహ్వీ నమాజ్‌ను ఆచరించారు. వేకువ జామునే నిద్రలేచి సహరీ పూర్తి చేసి, ఫజర్ నమాజ్ చదివారు. మత గురువులు రంజాన్ ప్రాముఖ్యత వివరించారు.