శ్రీ విజయ గణపతి విగ్రహ పునః ప్రతిష్ఠలో పాల్గొన్న MLA
W.G: భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలో శ్రీ విజయ గణపతి విగ్రహ పునః ప్రతిష్ఠ మహోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులవర్తి అంజిబాబు గణపతి స్వామివారిని దర్శించుకుని, విగ్రహ పునః ప్రతిష్ఠ జరగడం శుభ పరిణామమని అన్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించి ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలు అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు.