రాత్రి 10 తర్వాత స్పీకర్లు ఆపివేయాలి: ఎస్పీ

KRNL: వినాయక ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో ఘనంగా జరుపుకుందామని, రాత్రి 10 గంటల తర్వాత వినాయక మండపాల వద్ద లౌడ్ స్పీకర్లు ఆపివేయాలని విగ్రహ ఉత్సవ కమిటీలకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. విగ్రహ ఉత్సవ కమిటీ సభ్యులు తప్పనిసరిగా మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.