గిరిశిఖర గ్రామాల్లో భయం.. భయం

గిరిశిఖర గ్రామాల్లో భయం.. భయం

PPM: కురుపాం మండలంలో తిత్తిరి పంచాయతీలో సీడిగూడ, పులిపుట్టి, తిత్తిరి తదితర గిరిశిఖర గ్రామాల్లో నాలుగు ఏనుగుల గుంపు సంచరించింది. పంటలను నాశనం చేస్తూ గ్రామాల పరిసరాల్లో తిరుగుతుండటంతో గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి తక్షణమే ఏనుగుల గుంపును జనావాసాల నుంచి దూరంగా తరలించాలని కోరారు.