వర్ధన్నపేటలో వైద్య శిబిరం

WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో సోమవారం ప్రాథమిక ఉపకేంద్రం ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 120 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో 48 మందికి రిఫరల్, HB, వెయిట్, BP పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇందులో వైద్యులు జునైద్ ఖాన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.