11 మందిని సమాధి చేసిన కొండ చరియలు

గినియా దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానల కారణంగా కోనాక్రీకి 50 కి.మీ దూరంలో ఉన్న కొండ ప్రాంతంలో మట్టిదిబ్బలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో కొండకు ఆనుకుని ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారంతా సమాధి అయ్యారని అధికారులు వెల్లడించారు. 11 మంది మృతి చెందినట్లు భావిస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. ప్రాణాలతో ఉన్న వారి కోసం వెతుకుతున్నామని చెప్పారు