కోనసీమ పీచు కళాఖండాలకు జేపీ నడ్డా ప్రశంసలు

కోనసీమ: విశాఖపట్నంలో జరిగిన బీజేపీ సారథ్యం సభలో ఏర్పాటు చేసిన స్వదేశీ స్టాల్లో కోనసీమ మహిళలు కొబ్బరి పీచుతో తయారు చేసిన వస్తువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ స్టాల్‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సందర్శించి, మహిళల కళాఖండాలను పరిశీలించి అభినందించారు.