విశేష అలంకరణలో కోర్టులో గంగమ్మ

విశేష అలంకరణలో కోర్టులో గంగమ్మ

అన్నమయ్య: శ్రావణ మంగళవారం సందర్భంగా మదనపల్లెలోని కోర్టులో గంగమ్మ విశేష అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. వేకువ జామునే ఆలయ ప్రధాన అర్చకులు సుష్మిత్ సాయి అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ, ప్రసాదాలు స్వీకరించారు.