రెజ్లింగ్ పోటీలలో విద్యార్థులకు స్వర్ణ పతకాలు
నిర్మల్: జిల్లాలో జరిగిన సీఎం కప్ జిల్లా స్థాయి రెజ్లింగ్ పోటీలలో తానూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు శివప్రసాద్, గంగ ప్రసాద్ స్వర్ణ పతకాలు సాధించారు. వీరిద్దరూ ఇప్పుడు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. గ్రామీణ విద్యార్థుల విజయం పట్ల ప్రిన్సిపల్ ఫణి రాజశేఖర్, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.