భక్తులకు షాక్‌.. వసతి గదుల అద్దె భారీగా పెంపు

భక్తులకు షాక్‌.. వసతి గదుల అద్దె భారీగా పెంపు

AP: అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో భక్తుల కోసం ఉన్న వసతి గదుల అద్దెను ఆలయ అధికారులు భారీగా పెంచారు. డిసెంబర్ 1 నుంచి పెరిగిన అద్దెలు అమల్లోకి రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. హరిహర సదన్‌లో ఇప్పటి వరకు రూ.950గా ఉండగా.. రూ.1,500కు పెంచారు. సత్రం గది రోజుకు రూ.600 ఉండగా.. రూ.800, ప్రకాశ్ సదన్‌లో రూ.999 ఉండగా.. రూ.1,260 వసూలు చేయనున్నారు.