'ఈఎస్‌ఐ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి'
PDPL: పొరుగు సేవల ఉద్యోగులు ఈఎస్ఐ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని, రామగుండం – 3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు కోరారు. శనివారం జీఎం కార్యాలయంలో పొరుగుసేవల (కాంట్రాక్టు) ఉద్యోగుల కోసం ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ (ఈ.ఎస్.ఐ) కింద కాంట్రాక్టు ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు సదుపాయాలపై సంబధిత కాంట్రాక్టర్లకు అవగాహన సదస్సును నిర్వహించారు.