స్లాట్ బుకింగ్ సమస్యతోనే రైతుకు నష్టం: మాజీ మంత్రి

స్లాట్ బుకింగ్ సమస్యతోనే రైతుకు నష్టం: మాజీ మంత్రి

ADB: పత్తి రైతులకు స్లాట్ బుకింగ్ సమస్య ఒరికొయ్యలా తయారైందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. సోమవారం జైనథ్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రైతు హైదవ్ దీపక్ ఇంట్లో నిలువ ఉంచిన పత్తి అగ్ని ప్రమాదంలో కాలిపోవడంతో ఆయన ఆ ఇంటిని పరిశీలించారు. స్లాట్ బుకింగ్ కోసం ఎదురుచూస్తూ పత్తి ఇంట్లో ఉంచడం వల్లే ప్రమాదం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.