'బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థుల విన్నపం'

'బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థుల విన్నపం'

SRPT: హుజూర్ నగర్ పరిధిలోని సర్వారం, సీతారాంపురం, కొండాయిగూడెం, గానుగబండ గ్రామాలకు RTC బస్సు సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పేద విద్యార్థులు నడిచి స్కూల్, కాలేజీలకు వెళ్ళాల్సి వస్తుందని వాపోతున్నారు. కోదాడ–మిర్యాలగూడ రహదారి సమీపంలో ఉన్నా బస్సు రాకపోవడం పెద్ద సమస్యగా మారిందని, మంత్రి ఉత్తమ్ చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.