SHOCKING: కేవలం 10 రోజుల లోపే..!
భారత్‌కు చమురు దిగుమతులు నిలిచిపోతే, మన వద్ద ఉన్న నిల్వలు కేవలం 9.5 రోజులకు మాత్రమే సరిపోతాయని కేంద్రం తెలిపింది. విశాఖ(AP), మంగళూరు(KA), పాదూరులలోని వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వులలో(SPR) ప్రస్తుతం 33.72 లక్షల మెట్రిక్ టన్నుల ఆయిల్ ఉంది. వీటి మొత్తం సామర్థ్యం 53.3 లక్షల మెట్రిక్ టన్నులు. RTI ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ విషయాలను వెల్లడించింది.