'ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలి'

'ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలి'

కడప జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో పులివెందుల జడ్పీటీసీ లతా రెడ్డి పాల్గొన్నారు. నల్లపరెడ్డి పల్లిలో డ్రైనేజ్ వ్యవస్థ లేక మురుగు నీరు రోడ్లపై నిల్వ ఉండడం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఆమె ప్రస్తావించారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా కొత్త బోర్లు, ప్లాంట్ మరమ్మతులు వంటి పనులను అత్యవసరంగా చేపట్టాలని ఆమె కోరారు.