VIDEO: పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు
పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ కృత్తికా శుక్లా, ఎస్పీ బీ.కృష్ణారావు, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, పోలీస్ అడ్మిన్ అధికారులు పాల్గొని విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులకు నివాళులర్పించారు.