VIDEO: సమస్యల పరిష్కారం కోసం కార్మికుల అర్ధనగ్న నిరసన
JN: స్టేషన్ ఘన్‌పూర్ పట్టణ కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన దీక్ష సోమవారం ఆరో రోజుకు చేరింది. సమస్యల పరిష్కారం కోరుతూ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం, అధికారులు స్పందించకపోవడాన్ని నిరసిస్తూ ఈ చర్యకు దిగినట్లు తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న పోరాటానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.