నకిలీ కాల్స్‌కి మోసపోవద్దు: ఎస్పీ
KRNL: క్రెడిట్ కార్డు లిమిట్ పెంపు పేరుతో ఓటీపీ, కార్డ్ నంబర్, సీవీవీ అడిగి సైబర్ మోసాలు పెరుగుతున్నాయని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. బ్యాంకులు ఫోన్‌లో వ్యక్తిగత వివరాలు ఎప్పుడూ అడగవని అన్నారు. అనుమానాస్పద కాల్స్‌కు స్పందించకూడదని, తెలియని లింకులు క్లిక్ చేయకుండా, యాప్‌లు డౌన్‌లోడ్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.