VIDEO: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడికి తీవ్ర గాయాలు
అనకాపల్లి: ఎలమంచిలి మండలం పురుషోత్తపురం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోతురెడ్డిపాలెం నుంచి స్వగ్రామమైన పురుషోత్తపురం బైకుపై వెళుతుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన కాళ్ల పోతురాజు (60)ను అంబులెన్స్‌లో ఎలమంచిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారు టైరు పంచర్ అవ్వడంతో అదుపుతప్పి బైకును ఢీకొట్టింది.