VIDEO: షబ్బీర్ అలీకి జీపీవోల వినతి
KMR: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని శనివారం రెవెన్యూ జీపీవోలు కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ప్రొబేషన్ ఖరారు చేయాలని, టీజీపీఎస్‌సీ ద్వారా వచ్చిన వారికి సమాన వేతనాలు అమలు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన షబ్బీర్ అలీ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నారాయణరావు, అఖిల్, నాగరాజు, మధు తదితరులు పాల్గొన్నారు.